ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని పరామర్శించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: మహబూబ్ నగర్
మహబూబ్ నగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ పరామర్శించారు. ఈ మేరకు ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి బాధితుడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని ఈ సందర్భంగా వైద్యులను కోరినట్లు వి. శ్రీనివాస్ గౌడ్ - మాజీ మంత్రి, మహబూబ్ నగర్ వెల్లడించారు. బాధితుడి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు.