జన్నారంలో భక్తిశ్రద్ధలతో అమ్మవారికి ఘనంగా బోనాల సమర్పణ
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: జన్నారం
జన్నారం మండల కేంద్రంలో నవరాత్రి పండుగను పురస్కరించుకుని శ్రీ సిద్ధి వినాయక యూత్ ఆధ్వర్యంలో భక్తులు అత్యంత వైభవంగా బోనాల వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో స్థానిక ప్రజలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు సాంప్రదాయ రీతిలో తలపై బోనాలు ధరించి ఘనంగా నైవేద్యాలు సమర్పించడంతో స్థానిక ఆలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది.