అచ్యుతాపురం: నాలుగు రోజులుగా కరెంటు లేక రైతుల ఆవేదన
రిపోర్టర్: I am Farmer 🍅🌱
స్థలం: అచ్యుతాపురం
అచ్యుతాపురం మండలం చోడపల్లి గ్రామంలో నాలుగు రోజులుగా వ్యవసాయ మోటార్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ట్రాన్స్ఫార్మర్ను మార్చినప్పటికీ, అధికారులు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మండలించే ఎండలకు పంటలు ఎండిపోతున్నాయని, పశువులకు తాగునీరు కూడా అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులను అడిగితే కేవలం హామీలతోనే సరిపెడుతున్నారని, వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించి తమను ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.