రిమ్స్ ఘటన బాధితులకు ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి అగ్నిప్రమాద ఘటనలో ఉట్నూర్ మండలం మోమిన్పూర్కు చెందిన సమ్రీన్ శిశువు మృతి చెందడంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. బాధిత కుటుంబానికి ప్రభుత్వం మంజూరు చేసిన ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయ పరిహార చెక్కును ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రిమ్స్ దుర్ఘటన అత్యంత విషాదకరమని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, అధికారులతో మాట్లాడి మరిన్ని సహాయ సహకారాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.