కుర్మీ వర్గీయులపై గత ప్రభుత్వం నమోదు చేసిన కేసులను ఎత్తివేస్తామన్న సువెందు అధికారి
రిపోర్టర్: గోపి
స్థలం: West Bengal
పశ్చిమ బెంగాల్‌లోని పురులియాలో జరిగిన కుర్మీ కరమ్ వేడుకల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సువెందు అధికారి కీలక ప్రకటన చేశారు. గత సంవత్సరం నిరసనల సమయంలో కుర్మీ సంఘం సభ్యులపై గత ప్రభుత్వం నమోదు చేసిన కేసులన్నింటినీ ఎత్తివేస్తామని ఆయన ప్రకటించారు. గత మమతా బెనర్జీ ప్రభుత్వం కుర్మీ వర్గంలో విభజన సృష్టించిందని ఆరోపించిన ఆయన, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ బీజేపీ ప్రభుత్వం నెరవేరుస్తుందని స్పష్టం చేశారు.