రక్తమోడుతున్న చేతితో రణ్‌బీర్‌ కపూర్ లవ్‌ అండ్‌ వార్‌ ఫస్ట్‌లుక్

రిపోర్టర్: విజయ్ స్థలం: ముంబై

ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం లవ్‌ అండ్‌ వార్‌ నుంచి రణ్‌బీర్‌ కపూర్‌ ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఎయిర్‌ఫోర్స్‌ ఆఫీసర్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో ముక్కోణపు ప్రేమకథగా వస్తున్న ఈ చిత్రంలో రణ్‌బీర్ చేతికి గాయంతో రక్తమోడుతూ కనిపించడం విశేషం. రణ్‌బీర్‌కపూర్‌, అలియాభట్‌, విక్కీకౌశల్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.