వెంకట్రావుపేట అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులతో అక్షరాలు దిద్దించిన సర్పంచ్
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: లక్సెట్టిపేట
లక్షేట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట గ్రామ సర్పంచ్ నలిమెల రాజు బుధవారం అంగన్వాడీ కేంద్రంలో జరిగిన అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొన్నారు. అంగన్వాడీల ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందుతుందని తెలిపారు. ఈ సేవలను అందరూ వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మరియు అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.