భూముల రీసర్వేలో రైతులు భాగస్వాములు కావాలని కోరిన సర్పంచ్
రిపోర్టర్: Subhan.Manthani
స్థలం: మంథని
రైతులు తమ భూముల హక్కులను పరిరక్షించుకోవడానికి రెవెన్యూ రికార్డులను సరిచూసుకోవాలని గుంజపడుగు సర్పంచ్ దండేవేన సంధ్య పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం కాసిపేట శివారులో శుక్రవారం భూముల రీసర్వే నిర్వహించారు. ఈ సర్వే ద్వారా సరిహద్దులు, విస్తీర్ణం స్పష్టమవుతాయని ఆమె పేర్కొన్నారు. సర్వే సిబ్బందికి రైతులు తమ పత్రాలతో సహకరించాలని సూచించారు.