భారీ వర్షాలకు విశాఖలో ఐవోసీఎల్ టెర్మినల్ జలమయం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ టెర్మినల్ ప్రాంగణం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ప్లాంట్లోకి వరద నీరు వచ్చి చేరడంతో పెట్రోలియం ఉత్పత్తుల ఫిల్లింగ్ ప్రక్రియ పూర్తిగా స్తంభించిపోయింది. ముందస్తు జాగ్రత్త చర్యగా సిబ్బంది లోడింగ్ పనులను నిలిపివేయడంతో డిపో వద్ద భారీగా ట్యాంకర్లు నిలిచిపోయాయి. ప్లాంట్లో చేరుకున్న నీటిని మోటార్ల ద్వారా బయటకు తోడేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.