నామినేషన్ల కేంద్రాల వద్ద అరాచకం: కూటమి సర్కార్ తీరుపై సజ్జల మండిపాటు

రిపోర్టర్: సురేష్ స్థలం: అమరావతి

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో కూటమి ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోందని వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా ఆరోపించారు. నామినేషన్ల కేంద్రాల వద్ద తమ పార్టీ అభ్యర్థులపై దాడులు చేస్తున్నారని, పోలీసుల సహకారంతో అధికార పార్టీ నాయకులు అణచివేత ధోరణి అవలంబిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి, రాయచోటి, పుంగనూరు, కడప ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాలు ప్రజాస్వామ్య వ్యవస్థకు పెను ముప్పుగా మారాయని మండిపడ్డారు.