'ఈశ్వరీయ కానుక': బ్లైండ్ స్కూల్ ప్రిన్సిపాల్‌కు రాఖీ కట్టిన బ్రహ్మ కుమారీస్
రిపోర్టర్: Bobbili GANESH
స్థలం: బొబ్బిలి
విజయనగరం జిల్లా బొబ్బిలి సమీపంలోని గొర్ల సీతారాంపురం గ్రామంలో ఉన్న ఏషియన్ ఎడిట్ బ్లైండ్ స్కూల్ ప్రిన్సిపాల్ విద్యార్థులకు అందిస్తున్న సేవలను గుర్తించి బ్రహ్మ కుమారీస్ సెంటర్ ఇంచార్జి బి.కె. రాజేశ్వరి అక్కయ్య మంగళవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయనకు ఈశ్వరీయ కానుకను ప్రదానం చేసి, రాఖీ కట్టి ఆశీర్వదించారు. దివ్యాంగ విద్యార్థుల అభ్యున్నతికి సేవనందిస్తున్న ప్రిన్సిపాల్ నిబద్ధతను ఈ వేడుకలో ప్రత్యేకంగా కొనియాడారు.