గణేష్ నిమజ్జనోత్సవంలో విద్యుత్ షాక్తో యువకుడు దుర్మరణం
రిపోర్టర్: విజయ్
స్థలం: జగిత్యాల
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొత్తపేటలో గణేష్ నిమజ్జన వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. బుధవారం రాత్రి సౌండ్ బాక్సులకు విద్యుత్ సరఫరా చేసే మెయిన్ వైర్లను సరి చేస్తుండగా షాక్కు గురై కొప్పుల రాజశేఖర్ మృతి చెందాడు. రాత్రి సమయంలో జరిగిన ఈ ప్రమాదంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నాలుగు రోజుల క్రితం ఇలాంటి ఘటనే జరగడం జిల్లాలో కలకలం రేపుతోంది.