మెటా ఎంటర్ప్రైజ్ ప్లాట్ఫాం చీఫ్గా భారత సంతతి టెక్కీ చిరంతన్ దేశాయ్

రిపోర్టర్: వెంకట్ స్థలం: హైదరాబాద్

ప్రముఖ టెక్ దిగ్గజం మెటా కొత్తగా ఏర్పాటు చేసిన ఎంటర్ప్రైజ్ ప్లాట్ఫాం బాధ్యతలను భారత సంతతికి చెందిన ప్రముఖ టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్ చిరంతన్ దేశాయ్ అలియాస్ సీజే దేశాయ్కు అప్పగించినట్లు కంపెనీ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ వెల్లడించారు. ఈ కొత్త విభాగం ద్వారా కృత్రిమ మేధస్సు నమూనాలు, ఏజెంట్లు ఇతర వాణిజ్య సాధనాలను కంపెనీలకు అందించనున్నారు. ఈ మేరకు దేశాయ్ నేరుగా మార్క్ జుకర్బర్గ్కు రిపోర్ట్ చేస్తారని కంపెనీ వర్గాలు స్పష్టం చేశాయి.