తాపీ కార్మిక సంఘం ఎన్నికలు.. పడవ, కొబ్బరికాయ గుర్తుకు ఓటెయ్యాలి

రిపోర్టర్: SHIVA స్థలం: బెల్లంపల్లి

బెల్లంపల్లి తాపీ కార్మిక సంఘం ఎన్నికలు ఈ నెల 6న ఆదివారం నిర్వహించనున్నట్లు సంఘ మాజీ ఉపాధ్యక్షుడు ఆవుల కొమురయ్య, మేస్త్రీలు తెలిపారు. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న సంకరీ కృష్ణకు పడవ గుర్తుపై, ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేస్తున్న ఎలగం శ్రీనివాస్కు కొబ్బరికాయ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని వారు కార్మికులను కోరారు.

కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేసే అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎన్నికలు జరుగుతాయని, సాయంత్రం ఫలితాలు ప్రకటిస్తామని తెలిపారు. కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.