నా భార్య నుంచి నాకు ప్రాణ రక్షణ కల్పించండి

రిపోర్టర్: వెంకట్ స్థలం: కాకినాడ

కాకినాడ జిల్లా పిఠాపురంలో పీజీఆర్‌ఎస్‌లో దివ్యాంగుడు శివాజీ తన భార్య వేధింపులపై ఫిర్యాదు చేశారు. రోడ్డు ప్రమాదంలో కాలు విరిగి మంచానికే పరిమితమైన తనను భార్య దుర్గ నిత్యం కొడుతూ, అన్నంలో మందు పెట్టి చంపుతానని బెదిరిస్తోందని వాపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, ఆత్మహత్యకు ప్రేరేపిస్తున్న ఆమె నుంచి తనకు ప్రాణ రక్షణ కల్పించాలని వేడుకున్నారు.