ఇంటి లోపలి కాలుష్యంతో ఊపిరితిత్తులు దెబ్బతింటాయని డాక్టర్ శరత్ హెచ్చరిక

రిపోర్టర్: హరి స్థలం: Hyderabad

ఇంటి లోపలి కాలుష్యం ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ శరత్ చంద్ర భృంగి హెచ్చరించారు. సరైన వెంటిలేషన్ లేకపోవడం, అగరబత్తులు, కర్పూరం పొగలు, సింథటిక్ ఎయిర్ ఫ్రెషనర్స్ కారణంగా వెలువడే విషపూరిత వాయువులు శ్వాసకోశ సమస్యలకు దారితీస్తాయని తెలిపారు. ఈ కాలుష్య కారకాలు ఆస్తమా, సీఓపీడీ వంటి దీర్ఘకాలిక వ్యాధులను కలిగిస్తాయని పేర్కొంటూ, ఇళ్లలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.