ఫ్లై దుబాయ్ అత్యవసర ఘటన: కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్యసాహసాలను కొనియాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి
రిపోర్టర్: హరి
స్థలం: సూర్యాపేట
మాజీ వైమానిక దళ పైలట్‌గా ఫ్లై దుబాయ్ విమాన అత్యవసర పరిస్థితిలో కెప్టెన్ స్మిత్ మచ్చర్ చూపిన అప్రమత్తత, ధైర్యసాహసాలు ప్రశంసనీయమని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ప్రయాణికులు మరియు సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి పెను ప్రమాదాన్ని అడ్డుకున్నారని ఆయన వెల్లడించారు. ఈ క్లిష్ట సమయంలో కెప్టెన్ ప్రదర్శించిన తెగువ అనేక ప్రాణాలను కాపాడిందని, ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యం చేకూరుకోవాలని హృదయపూర్వక ఆకాంక్షలు తెలిపారు.