టీ20 కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన బంగ్లాదేశ్ ప్లేయర్ నిగర్ సుల్తానా

రిపోర్టర్: రాము స్థలం: Bangladesh

ఆసియా క్రీడల సెమీఫైనల్లో భారత జట్టు చేతిలో ఓటమిపాలైన తర్వాత బంగ్లాదేశ్ మహిళల టీ20 జట్టు కెప్టెన్సీ నుంచి నిగర్ సుల్తానా తప్పుకున్నారు. బ్యాటింగ్ మీద పూర్తి దృష్టి సారించడం కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె స్పష్టం చేశారు. వ్యక్తిగత ప్రదర్శనతో పాటు జట్టు కోసం మరిన్ని పరుగులు సాధించాలనే ఉద్దేశంతోనే కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు మీడియాతో పేర్కొన్నారు.