అనంతపురంలో విషాదం: రైలు కిందపడి తల్లీ, ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్య

రిపోర్టర్: అశోక్ స్థలం: అనంతపురం

అనంతపురం జిల్లా యాడికి మండలం రాయలచెరువు వేములపాడు గ్రామాల మధ్య తీవ్ర విషాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. రైలు కిందపడి తల్లితో పాటు ఇద్దరు కుమార్తెలు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తల్లి మరియు ఒక కుమార్తె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, తీవ్రంగా గాయపడిన మరో చిన్నారి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి మృతదేహాలను పోస్ట్ మార్టానికి తరలించారు.