సూర్య సినిమాలో విలన్గా నటిస్తున్నా: మలయాళ నటుడు నాస్లెన్ కీలక వ్యాఖ్యలు

రిపోర్టర్: కిరణ్ స్థలం: కేరళ

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రంలో ప్రతినాయక పాత్ర పోషిస్తున్నట్లు మలయాళ యువ నటుడు నాస్లెన్ స్పష్టం చేశారు. జిత్తు మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నటించడం తనకు ఎంతో అద్భుతమైన అనుభూతిని ఇచ్చిందని ఆయన వెల్లడించారు. కేరళలో జరిగిన చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న నాస్లెన్, తమిళ భాష రాకపోవడం వల్ల కొంత ఇబ్బంది ఎదురైందని, అయినప్పటికీ ఈ సినిమాలో నటించడం ఎంతో ఉత్సాహాన్నిచ్చిందని పేర్కొన్నారు.