విజయవాడలో వైకాపా మూకల వీరంగం ఉపాధ్యాయులపై కర్రలు రాళ్లతో దాడి
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: విజయవాడ
విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై ధర్నా ముసుగులో వైకాపా మూకలు వీరంగం సృష్టించాయి. రౌడీషీటర్ల నేతృత్వంలో కర్రలు, రాళ్లు, కోడిగుడ్లతో ఉపాధ్యాయులపై దాడికి తెగబడ్డాయి. గురువులకు రక్షణగా నిలిచిన వారిపై దాడులు చేసి తలలు పగలగొట్టాయి. బూతులు తిడుతూ, తొడలు కొడుతూ మూడు గంటల పాటు ఉద్రిక్తత సృష్టించి ఎంజీ రోడ్డులో ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి.