ఆంధ్రా పేపర్స్ పన్ను బకాయిలపై పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: అశోక్
స్థలం: తూర్పు గోదావరి
రాజమండ్రిలో ఆంధ్రా పేపర్స్ యాజమాన్యం 2016 నుండి పన్నులు చెల్లించకుండా కోట్ల రూపాయలు ఎగ్గొట్టడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, పరిశ్రమ నుండి వెలువడుతున్న వ్యర్థాలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తక్షణమే రంగంలోకి దిగి బాధ్యతారహితంగా వ్యవహరించే సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన హెచ్చరించారు.