పేదల కష్టాలకు ఓదార్పునిస్తూ సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

రిపోర్టర్: KOLA MAHESH స్థలం: సంస్థాన్ నారాయణపురం

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామంలో శనివారం సీఎంఆర్ఎఫ్ ఆర్థిక సహాయ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో మంజూరైన చెక్కులను గ్రామశాఖ అధ్యక్షుడు గజం సత్యనారాయణ లబ్ధిదారులకు అందజేశారు. అయితరాజు యాదయ్య, పార్వతమ్మ, కొలను లక్ష్మమ్మ, మెరుగు అండాలు, దేప దామోదర్ రెడ్డిలకు రూ.1.77 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. ఆపద సమయంలో ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యేకు లబ్ధిదారులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.