చంద్రుడిపై ధూళిని నివారించే ప్రాజెక్ట్‌కు విద్యార్థినికి ఇరవై ఐదు వేల డాలర్ల పురస్కారం

రిపోర్టర్: సునీల్ స్థలం: World

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం రోసెన్‌బర్గ్‌కు చెందిన పదహారేళ్ల విద్యార్థిని జియాన్ జియాంగ్ చంద్రుడిపై భవిష్యత్తులో నిర్మించే ఆవాసాలలోకి లూనార్ డస్ట్ ప్రవేశించకుండా నిరోధించే మూండస్ట్ మాగ్నెట్ అనే ఇంజనీరింగ్ ప్రాజెక్ట్‌ను రూపకల్పన చేసి ఇరవై ఐదు వేల డాలర్ల డేవిడ్సన్ ఫెలోస్ స్కాలర్‌షిప్‌ను గెలుచుకున్నారు. అంతరిక్ష పరిశోధనలకు ఎంతో ఉపయోగపడే ఈ వినూత్న ఆవిష్కరణను ఆమె లూనార్ డస్ట్ సిమ్యులేటర్లను ఉపయోగించి ప్రయోగాత్మకంగా నిరూపించారు.