విశాఖలో సంచలనం సృష్టించిన మృతి కేసు: దర్యాప్తులో ఆత్మహత్యగా తేల్చిన పోలీసులు
రిపోర్టర్: సతీష్
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నం నేవల్ క్వార్టర్స్ ఎదురుగా బీచ్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన మైలపల్లి చంటి కేసును పోలీసులు ఛేదించారని ఏసీపీ చిట్టిబాబు వెల్లడించారు. మద్యానికి బానిసైన చంటి మానసిక అనారోగ్యంతో తనంతట తానే మెడకు తాడు బిగించుకుని, తలపై గాయపరుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోస్ట్ మార్టం నివేదికలో స్పష్టమైందని తెలిపారు. ఎవరో తనను చంపడానికి వెంబడిస్తున్నారనే భ్రామకంతోనే అతను ఈ తీవ్ర నిర్ణయానికి పాల్పడినట్లు పోలీసులు తేల్చిచెప్పారు.