అమెరికాలో కలకలం: బోస్టన్ లో తెలంగాణ విద్యార్థిని శ్రీజ రెడ్డి అదృశ్యం
రిపోర్టర్: నరేష్
స్థలం: బోస్టన్
అమెరికాలోని బోస్టన్ లో తెలంగాణకు చెందిన ఇరవై మూడు ఏళ్ల విద్యార్థిని శ్రీజ రెడ్డి అదృశ్యమైనట్లు ఆమె తండ్రి కొయ్య యాదగిరి రెడ్డి తెలిపారు. నవంబర్ రెండున నడక కోసం గది నుండి వెళ్లిన ఆమె తిరిగి రాలేదని, మొబైల్ స్విచ్ ఆఫ్ వచ్చిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. గత ఐదు రోజులుగా ఆమె జాడ తెలియకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.