స్థానిక ఎన్నికల వేళ సంగంలో పోలీసుల భారీ ఫ్లాగ్ మార్చ్
రిపోర్టర్: saikumar
స్థలం: సంగం
రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లో భద్రతా భావం కల్పించడంతో పాటు ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడడమే లక్ష్యంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు సీఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సంగంలో సర్కిల్ పరిధిలోని ఎస్సైలు, సిబ్బందితో కలిసి కెనరా బ్యాంక్ నుండి శివాలయం వరకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. గ్రామాల్లో ఎలాంటి గొడవలు చోటుచేసుకోకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన కోరారు.