రైతు గర్జన మహాసభ: కాంగ్రెస్ పాలనపై మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపాటు
రిపోర్టర్: విజయ్
స్థలం: నిర్మల్
కాంగ్రెస్ పాలనలో అన్నదాతలు అడుగడుగునా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఈ నెల 11న నిర్వహించనున్న బీఆర్ఎస్ రైతు గర్జన మహాసభ పోస్టర్లను ఆయన శుక్రవారం ఆవిష్కరించారు. కేసీఆర్ హయాంలో రైతులు రాజులా బతికారనీ, నేడు యూరియా కోసం క్యూలో పడిగాపులు కాయాల్సిన దుస్థితి ఏర్పడిందనీ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.