మహిళలను కోటీశ్వరులను చేయడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యం: మంత్రి సీతక్క

రిపోర్టర్: కిరణ్ స్థలం: ఖమ్మం

సత్తుపల్లిలో కాంగ్రెస్ పాలన 1000 రోజుల వేడుకల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. మహిళా సంఘాలకు రూ.61 వేల కోట్ల రుణాలు అందించామని, కోటిమందిని కోటీశ్వరులను చేయడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఉచిత బస్సు వద్దంటున్న బీఆర్ఎస్ నేతలు, బియ్యం, పింఛన్లు కూడా వద్దంటారా? అని ఘాటుగా ప్రశ్నించారు. మహిళలు రుణాలు పొంది వ్యాపారవేత్తలుగా ఎదగాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మట్టా రాగమయి, కలెక్టర్ దివాకర పాల్గొన్నారు.