పుణెలో పదేళ్ల బాలికకు అరుదైన మాక్రోఫేజ్ యాక్టివేషన్ సిండ్రోమ్ గుర్తింపు

రిపోర్టర్: అశోక్ స్థలం: Pune

పుణెలోని మదర్హుడ్ ఆసుపత్రిలో పదేళ్ల బాలికకు మాక్రోఫేజ్ యాక్టివేషన్ సిండ్రోమ్ అనే అరుదైన, ప్రాణాంతక వ్యాధి సోకినట్లు వైద్యులు గుర్తించారు. పది రోజుల పాటు అధిక జ్వరం, కీళ్ల నొప్తులు, చర్మంపై దద్దుర్లతో బాధపడుతున్న బాలికను పీఐసీయూ కన్సల్టెంట్ డాక్టర్ అమర్ భిసే నేతృత్వంలోని వైద్య బృందం పరీక్షించి ఈ వ్యాధిని నిర్ధారించింది. రోగనిరోధక వ్యవస్థ అతిగా స్పందించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని, దీనికి సకాలంలో చికిత్స అందించకపోతే ముప్పు పెరుగుతుందని వైద్యులు వెల్లడించారు.