జన్నారం దసరా క్రికెట్ పోరులో ఘనవిజయం సాధించిన భోగ్యనాయక్ తండా
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: జన్నారం
మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో నిర్వహించిన దసరా క్రికెట్ పోటీల్లో భాగంగా జరిగిన మ్యాచ్లలో భోగ్య నాయక్ తండా జట్టు అద్భుతమైన విజయం సాధించింది. భోగ్య నాయక్ తండా మరియు మూంగట తండా జట్ల మధ్య హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఆటగాళ్లు అరివీర భీకర ప్రదర్శన కనబరిచారు. స్థానిక యువత క్రీడా స్ఫూర్తిని చాటుకుంటూ ఉత్సాహంగా పాల్గొని ప్రేక్షకులను విశేషంగా అలరించారు.