హైదరాబాద్ లో హార్వర్డ్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సులు

రిపోర్టర్: విజయ్ స్థలం: Hyderabad

తెలంగాణను గ్లోబల్ నాలెడ్జ్ హబ్ గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ ద్వారా హైదరాబాద్ లో డిసెంబర్ నుండి ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సులు అందించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. విద్య, నైపుణ్యం, ఆవిష్కరణలకు రాజధానిని అంతర్జాతీయ వేదికగా మారుస్తామని తెలిపారు.