జామియా మిలియా ఇస్లామియా నిర్ణయం: ఆన్లైన్ మోడ్‌లోనే సెమిస్టర్ పరీక్షలు నిర్వహణ
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: న్యూఢిల్లీ
జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సెమిస్టర్ పరీక్షలను ఆన్లైన్ విధానంలోనే నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మొహమ్మద్ మహతాబ్ ఆలం రిజ్వి తెలిపారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక ఉత్తర్వుల్లో వెల్లడించారు. నవంబర్ ఇరవై నాలుగు వరకు ఆన్లైన్ తరతులు కొనసాగుతాయని, డిసెంబర్ ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు థియరీ పరీక్షలు ఆన్లైన్లోనే జరుగుతాయని వర్సిటీ స్పష్టం చేసింది.