ఉద్యోగులకు షాక్: పదిహేను వేలు దాటిన గిఫ్ట్ లపై పన్ను విధింపు

రిపోర్టర్: నరేష్ స్థలం: హైదరాబాద్

ఉద్యోగులకు కంపెనీలు అందించే దీపావళి బహుమతులు మరియు గిఫ్ట్ వోచర్లపై కేంద్ర ఆదాయపు పన్ను శాఖ నూతన నిబంధనలు అమల్లోకి తెచ్చినట్లు ఆర్థిక నిపుణులు వెల్లడించారు. నూతన ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో గిఫ్ట్ల మొత్తం విలువ రూ.15 వేలు దాటితే ఉద్యోగులు విధిగా ట్యాక్స్ కట్టాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అయితే పండుగ బోనస్ లకు ఈ మినహాయింపు వర్తించదని పేర్కొన్నారు.