అసెంబ్లీ ముట్టడికి యత్నించిన బీఆర్ఎస్వీ శ్రేణుల అరెస్ట్

రిపోర్టర్: రాజేష్ స్థలం: హైదరాబాద్

తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి యత్నించిన బీఆర్ఎస్వీ కార్యకర్తలను పోలీసులు ఎల్బీ స్టేడియం వద్ద అడ్డుకుని అరెస్ట్ చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని, జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.