సంగారెడ్డి జిల్లాలో గణేష్ నిమజ్జనం సందర్భంగా మద్యం దుకాణాలు బంద్

రిపోర్టర్: శివ స్థలం: సంగారెడ్డి

సంగారెడ్డి జిల్లాలో గణేష్ నిమజ్జనాన్ని పురస్కరించుకుని ఈ నెల 25న ఉదయం 6 గంటల నుంచి 26 ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, బార్లు, కల్లు డిపోలను మూసివేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశాలు జారీ చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ నిమిత్తం క్యూర్ పరిధి మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో ఈ ఆంక్షలు కఠినంగా అమల్లో ఉంటాయని, ఎక్సైజ్, పోలీస్ శాఖల అధికారులు దీన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆయన స్పష్టం చేశారు.