డెహ్రాడూన్ జూ పార్కులోకి ప్రవేశించిన వైట్ టైగర్ తేజస్
రిపోర్టర్: సతీష్
స్థలం: డెహ్రాడూన్
డెహ్రాడూన్ జూ పార్కులోకి రెండున్నరేళ్ల వయసున్న వైట్ టైగర్ తేజస్ ప్రవేశించిందని అధికారులు తెలిపారు. గ్వాలియర్ నుండి జంతు మార్పిడి కార్యక్రమం ద్వారా తేజస్ ను ఇక్కడికి తీసుకువచ్చినట్లు వెల్లడించారు. భోలా అనే రాయల్ బెంగాల్ టైగర్ ను గ్వాలియర్ జూకు తరలించామని పేర్కొన్నారు. కాగా, నూతన ప్రాంతానికి వచ్చిన తేజస్ కు ప్రస్తుతం ఇరవై రోజుల పాటు క్వారంటైన్ మరియు ప్రత్యేక వైద్య పర్యవేక్షణ కొనసాగుతుందని వివరించారు. త్వరలోనే పర్యాటకులకు ఈ అరుదైన తెల్ల పులిని ప్రదర్శించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.