రేవంత్ అన్నా మా రైతులను ఆదుకోండి అంటూ మహిళా రైతు నిరసన
రిపోర్టర్: నరేష్
స్థలం: వరంగల్
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం వెంకటాపురంలో కాలువ నీరు అందక, వర్షాలు కురవక పంట ఎండిపోయిందని మహిళా రైతు లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. అప్పు తెచ్చి సాగు చేస్తే నష్టం మిగిలిందని, బ్యాంకు లోన్ కట్టలేని పరిస్థితిలో ఉన్నామని పొలంలో ఫ్లెక్సీ కట్టి వినూత్నంగా నిరసన తెలిపారు. రేవంత్ అన్నా మా రైతులను ఆదుకోవాలని ఆమె వేడుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.