సంకిలి షుగర్ ఫ్యాక్టరీని మూతపడకుండా కాపాడాలి.. ఎమ్మెల్యే బేబీనాయనకు వినతి

రిపోర్టర్: Bobbili GANESH స్థలం: బొబ్బిలి

విజయనగరం జిల్లా బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన)ను సంకిలి షుగర్ ఫ్యాక్టరీ పరిరక్షణ సమితి సభ్యులు శుక్రవారం కలిశారు. ఎల్నినో ప్రభావంతో సంకిలి చక్కెర కర్మాగారాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేయాలన్న యాజమాన్యం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వారు వినతిపత్రం అందజేశారు.

రైతు ప్రయోజనాల దృష్ట్యా కర్మాగారాన్ని కాపాడేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ఎమ్మెల్యే బేబీనాయన హామీ ఇచ్చినట్లు సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు బుడితి అప్పలనాయుడు, ఓమ్మి రమణ తదితరులు పాల్గొన్నారు.