బీసీల రక్షణ కోసమే పటిష్టమైన చట్టం రూపకల్పన
రిపోర్టర్: మదన్ రాయల్
స్థలం: తిరుపతి అర్బన్
విజయవాడలోని బీసీ భవన్లో మంత్రి ఎస్. సవిత అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ జి. నరసింహ యాదవ్ పాల్గొన్నారు. బలహీన వర్గాల ధన, మాన, ప్రాణ రక్షణే ధ్యేయంగా బీసీ రక్షణ చట్టాన్ని తీసుకువస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో బీసీలపై జరిగిన అణచివేతలను ఎండగట్టారు. అన్ని వర్గాల సలహాలు తీసుకుని రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ చట్టాన్ని ఆమోదించనున్నట్లు స్పష్టం చేశారు.