స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ల పునరుద్ధరణ
రిపోర్టర్: మదన్ రాయల్
స్థలం: తిరుపతి అర్బన్
స్థానిక సంస్థలలో వెనుకబడిన వర్గాలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లను తిరిగి కల్పిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ జి. నరసింహ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు సముచిత రాజకీయ భాగస్వామ్యం కల్పిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం అట్టడుగు వర్గాల ఆత్మగౌరవానికి పెద్ద పీట వేస్తుందని పేర్కొన్నారు.