హైదరాబాద్లో భారీ నీటి కష్టాలు: ముప్పై ఆరు గంటల పాటు సరఫరా బంద్

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Hyderabad

హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ముప్పై ఆరు గంటల పాటు తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోనున్నట్లు జలమండలి అధికారులు వెల్లడించారు. కృష్ణా తాగునీటి సరఫరా ప్రాజెక్టు పరిధిలో అత్యవసర మరమ్మతు పనులు చేపడుతున్నట్లు తెలిపారు. అక్టోబర్ ఐదవ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి ఆరో తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు పనులు కొనసాగుతాయని పేర్కొన్నారు. కాబట్టి ప్రజలు తగినంత నీటిని నిల్వ ఉంచుకోవాలని, పొదుపుగా వాడుకోవాలని జలమండలి అధికారులు విజ్ఞప్తి చేశారు.