నాగ్పూర్ దవాఖానలో వైద్యుడిపై పోలీసు దాడి: నిరసనగా నిరవధిక సమ్మెకు పిలుపు

రిపోర్టర్: సురేష్ స్థలం: నాగ్‌పూర్

మహారాష్ట్రలోని నాగ్పూర్ మేయో ఆసుపత్రిలో రెసిడెంట్ వైద్యుడిపై పోలీసు అధికారి, ఆయన కుమారుడు దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు నిరసనగా ఆసుపత్రి వైద్యులు నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. వైద్యుడిపై దాడి దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయని, వెంటనే నిందితులను అరెస్టు చేయాలని అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారని అధికారులు తెలిపారు. పరస్పర ఫిర్యాదులతో కేసులు నమోదయ్యాయి.