పాఠశాల సమయానికి ఆర్టీసి బస్సులు నడపాలంటూ విద్యార్థుల ధర్నా

రిపోర్టర్: విజయ్ స్థలం: సంగారెడ్డి

సంగారెడ్డి జిల్లాలో పాఠశాల, కళాశాల సమయాలకు అనుగుణంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు సోమవారం బెల్లాపూర్ ఎక్స్‌రోడ్డు వద్ద రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. నారాయణఖేడ్ నుంచి ఉదయం, సాయంత్రం వేళల్లో పులుకుర్తి వరకు ప్రత్యేక బస్సులు నడిపించాలని విద్యార్థులు కోరారు. సమాచారం అందుకున్న మనూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆర్టీసి అధికారులతో మాట్లాడి బస్సులు నడిపేలా హామీ ఇప్పించడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.