'కార్మికుల ప్రాణాలు కాపాడేలా ఐఓటీ పరికరం': యువ ఇంజినీర్ మోహన్ రావు

రిపోర్టర్: రమేష్ స్థలం: విశాఖపట్నం

పరిశ్రమల్లో జరిగే ప్రమాదాలను అరికట్టి కార్మికుల ప్రాణాలు కాపాడేందుకు విశాఖకు చెందిన యువ ఇంజినీర్ మోహన్ రావు 'సైన్స్ మైండ్స్ 360' ఐఓటీ పరికరాన్ని రూపొందించారు. శ్రీకాకుళం జిల్లా చెట్లతాండ్ర గ్రామానికి చెందిన మోహన్‌రావు ఏఐ స్మార్ట్ లైవ్ సొల్యూషన్స్ సంస్థను స్థాపించి, యంత్రాల పనితీరును సెన్సార్ల ద్వారా పర్యవేక్షించే టెక్నాలజీని అభివృద్ధి చేశారు. ఈ ఆవిష్కరణకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ హ్యాకథాన్‌లో రన్నరప్‌గా నిలవడంతో పాటు దిల్లీలో ఇంటర్నేషనల్ అచీవర్స్ కాన్ఫరెన్స్ అవార్డును సొంతం చేసుకున్నారు.