ఆంధ్రప్రదేశ్ తుపాన్ నష్టంపై ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు వివరణ
రిపోర్టర్: గోపి
స్థలం: అమరావతి
వరుస తుపాన్లతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అండగా నిలుస్తామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. మురసు తుపాను వల్ల రాష్ట్రంలో సంభవించిన ప్రాణ, ఆస్తినష్టాలపై ప్రధానికి ఆయన ఫోన్ ద్వారా వివరించారు. వ్యవసాయ రంగానికి వాటిల్లిన తీవ్ర నష్టాన్ని నివేదించి, తక్షణ ఆర్థిక సహాయం అందించాలని కోరారు. స్పందించిన ప్రధాని కేంద్రం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.