పుతిన్‌కు రష్యన్ భగవద్గీతను బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోదీ
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: న్యూఢిల్లీ
బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా ఢిల్లీలోని భారత్ మండపంలో ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు రష్యన్ భాషలో ఉన్న భగవద్గీతను అరుదైన బహుమతిగా అందించారు. ఇరువురు నేతలు ఆత్మీయంగా కరచాలనం చేసుకుని ఆలింగనం చేసుకున్నారు. ఈ అరుదైన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.