ఉద్యోగులకు ఊహించని బహుమతి: కోట్లలో జీతం కాకుండా ఏకంగా లగ్జరీ కార్లు ఇచ్చిన బాస్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Jiaozuo

చలికాలంలో తన ఉద్యోగులు పడుతున్న కష్టాలను చూసి చలించిపోయిన చైనాకు చెందిన మహిళా రెస్టారెంట్ యజమాని మా యాన్లి అరుదైన బహుమతిని అందజేశారు. సుమారు నలభై మూడు లక్షల రూపాయల విలువైన రెండు సరికొత్త బీఎండబ్ల్యూ కార్లను కొనుగోలు చేసి తమ సంస్థలో ఎనిమిదేళ్లుగా పనిచేస్తున్న లి జేతో పాటు మరో ఉద్యోగికి పూర్తిగా ఉచితంగా కానుకగా ఇచ్చినట్లు స్థానిక మీడియా తెలిపింది.