ఈహెచ్ఎస్ పాత బకాయిల చెల్లింపులపై ఆర్థిక శాఖతో చర్చిస్తామన్న సీఈవో పద్మావతి
రిపోర్టర్: భాస్కర్
స్థలం: అమరావతి
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ లో ప్రతి నెలా బిల్లులు ఎప్పటికప్పుడు క్లియర్ చేయడంతో పాటు, రూ. 267 కోట్ల పాత బకాయిలు మంజూరయ్యేలా ఆర్థిక శాఖతో చర్చిస్తామని ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ సీఈవో పద్మావతి తెలిపారు. మంగళగిరిలోని ట్రస్ట్ కార్యాలయంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన మేనేజ్మెంట్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు త్వరలో డిజిటల్ హెల్త్ కార్డులు అందజేస్తామని, అక్టోబర్ రెండో వారంలో ఆసుపత్రుల యాజమాన్యాలతో ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసి వివిధ సమస్యలపై చర్చిస్తామని ఆమె స్పష్టం చేశారు.