షాకింగ్ ఘటన: మెడికల్ అసిస్టెన్స్‌తో తుదిశ్వాస విడిచిన ప్రముఖ నటి బార్బరా
రిపోర్టర్: శివ
స్థలం: New York
అమెరికాకు చెందిన ప్రముఖ నటి బార్బరా బారీ క్యాన్సర్ బారిన పడి మ్యాన్హాటన్లోని తన నివాసంలో వైద్య సహాయంతో తుదిశ్వాస విడిచారని ఆమె కుమార్తె జేన్ హార్నిక్ తెలిపారు. తొంబై ఐదు సంవత్సరాల వయసు ఉన్న బార్బరా ప్రాణాంతక వ్యాధితో బాధపడుతూ న్యూయార్క్ నగరంలో అమలైన కొత్త చట్టం ద్వారా ఈ నిర్ణయం తీసుకున్నారని, కుటుంబ సభ్యులందరూ ఆమె కోరికను గౌరవించి పూర్తి మద్దతు తెలిపారని జేన్ స్పష్టం చేశారు.